Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


న్యాయపరమయిన ఆచరణ సంహిత ( ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ )

ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఈ క్రింది విషయములకు వర్తిస్తుంది

 • రుణాల కోసం దరఖాస్తులు మరియు వాటి ప్రాసెసింగ్
 • రుణ విలువకట్టడం మరియు నిబంధనలు / నియమాలు
 • రుణాల పంపిణీ నియమ నిబంధనలలోని మార్పులతో కలుపుకొని
 • పంపిణీ తర్వాత పర్యవేక్షణ.
 • ఇతర సాధారణ కేటాయింపులు.

రుణాల కోసం దరఖాస్తులు మరియు వాటి ప్రాసెసింగ్


 • అన్ని వర్గాల రుణముల గురించిన దారఖాస్తు ఫారములందు, రుణగ్రహీత కోరిన మొత్తంతో సంభంధం లేకుండా, ఫీజు / ఛార్జీలు ఏవైనా ఉంటే, ప్రాసెసింగ్ కోసం చెల్లించవలసినది, అప్లికేషన్ స్వీకరంచని పక్షంలో తిరిగి చెల్లించ వలసిన అటువంటి చార్జీల మొత్తం, ముందస్తు చెల్లింపులు మరియు అదనపు ఛార్జీలు, అటువంటి ముందస్తు చెల్లింపులకు సంభంధించిన వడ్డీని గురించిన సమాచారం పొందుపరచ వలేను;
 • రుణగ్రహీత చెందియున్న విభాగమును బట్టి, రూ. 2 లక్షల వరకు ప్రాధాన్యత రంగా రుణాల ప్రామాణిక అప్లికేషన్ ఫారాలు , ఫీజు మరియు ఆరోపణలు మొదలైనవి షెడ్యూల్ తో పాటు దరఖాస్తుదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచవలెను.
 • పూర్తిచేయబడిన దరఖాస్తులు అందినట్లు తెలియజేస్తూ లోన్ ఫారాల ప్రక్రియ పరిష్కరించబడు కాలవ్యవధి గురించి ప్రస్తుతించవలెను.
 • అదనపు వివరాలు / పత్రాలు ఏవయినా కావలసినచో, ఒక సహేతుకమైన వ్యవధిలో దరఖాస్తుదారునికి తెలియజేయవలయును.
 • అన్ని వర్గాల రుణములకు, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లతో సహా , నిర్దేశించిన పరిమితులతో సంభంధం లేకుండా, పరిశీలన తరువాత బ్యాంకు యొక్క అభిప్రాయం ప్రకారం తిరస్కరణకు దారితీసిన ప్రధాన కారణాలను నిర్దేశించిన సమయ వ్యవధి లోపల బ్యాంక్ తప్పక లిఖిత పూర్వకంగా తెలియజేయవలెను.

రుణ అంచనా మరియు నిబంధనలు / నియమాలు

 • రుణగ్రహీత సమర్పించిన లోన్ అప్లికేషన్ బ్యాంకు యొక్క పాలసీ మార్గదర్శకాల మేరకు ప్రాసెస్ చెయ్యబడుతుంది. మార్జిన్ మరియు భద్రతా ఒడంబడిక రుణగ్రహీత యొక్క ఋణ యోగ్యతకు ప్రత్యమ్నాయంగా తీసుకోబడవు.
 • మంజూరు చేయబడిన రుణ పరిమితితో పాటు నిబంధనలు మరియు షరతులు వ్రాతపూర్వకంగా తెలియజేయబడును మరియ ఇటువంటి నియమాలు మరియు నిబంధనలు పట్ల రుణగ్రహీత యొక్క అంగీకారమును వ్రాతపూర్వకంగా గ్రహించి పొందుపరచబడును.
 • బ్యాంకు మరియు రుణగ్రహీత పరస్పరం అంగీకరింన నిబంధనలు మరియు షరతులు, మరియు రుణ సౌకర్యాలను శాసించు ఇతర షరతులు వ్రాత పూర్వకంగా పత్రము తయారుచేసి బ్యాంకు అధికారిక ఆఫీసరు ద్వారా ధృవీకరించబడును. రుణ ఒప్పందం (లోన్ అగ్రిమెంట్ ) లో పేర్కొనబడిన అన్ని సంబంధిత ఎన్క్లోజర్సు యొక్క కాపీలతో పాటు రుణ పత్రాల కాపీలని రుణ అభ్యర్థికి ఇవ్వబడును.
 • వీలైనంతవరకూ రుణ ఒప్పంద పత్రము క్రెడిట్ సౌకర్యాలు కేవలం బ్యాంక్ యొక్క అభీష్టానుసారం నిర్ణయాయించబడును అని, మంజూరు పరిమితిని దాటి డ్రాయింగ్లు, ప్రత్యేకంగా అంగీకరించినవాటికే కాకుండా ఇతర ప్రయోజనం కోసం జారీ చేయబడిన చెక్కులను నిరాకరించుట, నిరర్థక ఆస్తులుగా ( NPA ) వర్గీకరించ బడిన ఖాతాల నుండి విత్ డ్రాయల్లను నిరాకరించుట మొదలగు సౌకర్యాల యొక్క అనుమతి లేదా నిరాకరణ గురించి సమాచారము కలిగియుండవలెను. సరైన సమీక్ష లేకుండా వ్యాపార వృద్ధి మొదలైన మరింత క్రెడిట్ అవసరాలను తీర్చేందుకు బ్యాంకు బాధ్యత వహించదు.
 • కన్సార్టియం అమరిక కింద రుణ విషయంలో, పాల్గొనే బ్యాంకులు ప్రతిపాదన మూల్యాంకనం కొరకు పట్టే వ్యవధిని మరియు ఫైనాన్సింగ్ చేయాలా లేదా అనే నిర్ణయం ఒక సహేతుకమయిన సమయం లోపల తెలియజేయబడును.

క్రెడిట్ ప్రతిపాదనలపై నిర్ణయమునకయి సమయ చట్రం ( టైమ్ ఫ్రేమ్ )

బ్రాంచ్ పవర్స్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు ఒకటి కంటే ఎక్కువ వారం ఉండదు
జోనల్ కార్యాలయం అధికారిక పరిధిలోకి వచ్చు ప్రతిపాదనలు రెండు వారాలలో నిర్ణయం తెలియజేస్తారు
ప్రధాన కార్యాలయం ( హెడ్డాఫీస్ ) అధికారిక పరిధిలోకి వచ్చు ప్రతిపాదనలు మేనేజింగ్ డైరెక్టర్ & ఛైర్మన్ ( సి‌ఎం‌డి ) పరిధిలోకి వచ్చు ఖాతాలకు బ్రాంచిలో ప్రతిపాదన తీసుకోబడిన రోజు నుండి 30 రోజులలోపు నిర్ణయం తెలియజేయబడును. నిర్వహణా కమిటీ ( మానేజింగ్ కమిటీ ) పరిధిలోకి వచ్చు ఖాతాలకు ర్ణయం 45 రోజుల్లో తెలియచేయబడును..

అప్లికేషన్స్ పరిష్కరించుట కోసం సమయం నిబంధనలు : ప్రాధాన్యత రంగ రుణాలు ( ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్ )

Rs.25,000 రుణాలు వరకు పక్షం
Rs.25,000 పైన రుణాలు 8-9 వారాలు
MSME కోసం
Rs.25,000 వరకు 2 వారాలు
రూ .5 లక్షల వరకు 4 వారాలు

రుణాల పంపిణీ నియమ నిబంధనలలోని మార్పులతో కలుపుకొని

 • మంజూరైనా రుణాల సకాల పంపిణీ అన్నీ నియమ మరియు నిబంధనలతో కూడిన అప్పు పత్రాలు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది.
 • వడ్డీ రేటు మరియు సేవ చార్జీలు పెరగడంతో సహా నిబంధనలను కోసం, ఏదైనా మార్పు రుణగ్రహీతలకు సమాచారం ఉంటుంది.
 • వడ్డీ రేట్లు మరియు ఛార్జీలలోని మార్పులు భవిష్యత్తులోనే ప్రభావితం చెందవలేను.
రుణ పంపిణీ తర్వాత పర్యవేక్షణ

 1. ముఖ్యంగా రూ .2 లక్షలు వరకు రుణాలకు సంబంధించి, రుణ పంపిణీ అనంతర పర్యవేక్షణ రుణగ్రహీత ఎదుర్కొను నిజమైన సమస్యలను నిర్మాణాత్మక దృష్టితో ఉంటుంది.
 2. ఒప్పందం కింద చెల్లింపు లేదా పనితీరు వేగవంతం చేసే మరియు అదనపు సెక్యూరిటీస్ ఆశించే నిర్ణయం తీసుకునే ముందు బ్యాంక్ రుణగ్రస్తులకు సరయిన నోటీసు ఇవ్వవలెను.
 3. రుణ సంబంధిత పూర్తి మరియు చివరి చెల్లింపులు అందిన తరువాత మరేయితర బ్యాంక్ కలిగియున్న హేతుబద్ధమైన హక్కు లేదా తాత్కాలిక రుణాలను దృష్టిలో ఉంచుకొని రుణానికి సంబంధించిన అన్ని సెక్యూరిటీలను రుణగ్రహీతలకు విడుదల చేయబడును. ఇటువంటి తాత్కాలిక హక్కు లేదా ఆఫ్ సెట్ హక్కుని .వర్తింపవలసి వస్తే, రుణగ్రహీతలకు అవసరమైన వివరాలతో కూడిన సరైన నోటీసు ఇవ్వబడును.

సాధారణ

 • లోన్ మంజూరు పత్రాల నియమ నిబంధనలలో పొందుపరచబడిన వాటి తప్ప మరియేతర వ్యవహారాల్లో బ్యాంకు జోక్యం చేసుకోదు ( రుణగ్రహీతకు సంభంధించిన మునుపటి తెలియజేయని కొత్త సమాచారం ఏదయినా బ్యాంకు నోటీసుకు వస్తే తప్ప ).
 • బ్యాంక్ తన రుణ వితరణ విధానంలో లింగం, కులం లేదా మతం ప్రాతిపాదిక మీద వివక్షతను కలిగివుండదు. అయితే, ఈ సమాజంలోని బలహీన వర్గాలకు కోసం ఏర్పడ్డ క్రెడిట్ లింక్ పథకాలలో పాలుగొనే శాఖలను ఇందులో జత చేయరాదు.
 • రుణాల రికవరీ కోసం రుణగ్రహీతలను అసందర్భ వేళలలో ఇబ్బంది పెట్టటము మరియు దౌర్జన్యముగా చేయి చేసుకోవటము వంటి అనవసర వేధింపులకు గురి చేయరాదు.
 • రుణ ఖాతాల బదిలీ విషయంలో, రుణగ్రహీత లేదా బ్యాంకు / ఆర్థిక సంస్థ తరపున వచ్చిన అభ్యర్థన పట్ల బ్యాంక్ యొక్క అనుమతి లేదా నిరాకరణ అభ్యర్థన అందిన తేదీ నుంచి 21 రోజులలో తెలియ చేయవలెను.

ఫిర్యాదులు

ఏదయినా ఫిర్యాదు / ఉపద్రవము సందర్భంలో, దరఖాస్తుదారు / రుణగ్రహీతలు సంబంధిత శాఖకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించవలసి ఉంటుంది. బ్రాంచ్ అధికారులు వెంటనే పరిష్కారముకయి భాధ్యత వహిస్తాయి.

ఉపద్రవ పరిష్కార యంత్రాంగం ( విధానము )

శాఖలు / కంట్రోలింగ్ కార్యాలయాలు తీసుకున్న నిర్ణయాలలో ఉత్పన్నమయ్యే అన్ని క్రెడిట్ ( రుణ ) సంబంధిత వివాదాలు తరువాతి స్థాయిలో పరిష్కరించ బడవలెను. అందువలన, ఈ క్రింద ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ( విధానము ) నిర్దేశించబడినది.

నిర్ణయం స్థాయి

పరిష్కార స్థాయి
బ్రాంచ్ జోనల్ కార్యాలయం (రెండవ స్థాయి అధికారిక)
జోనల్ కార్యాలయం (రెండవ స్థాయి అధికారిక) జోనల్ కార్యాలయం మొదటి స్థాయి అధికారిక
జోనల్ కార్యాలయం (1 వ స్థాయి అధికారిక AGM / DGM) హెడ్ ఆఫీసు
జోనల్ కార్యాలయం (1st లెవెల్ - జిఎం) , హెడ్ ఆఫీసులో జీఎం (సిఆర్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎండి

సిఎండి

నిర్వహణ కమిటీ (MC)

chiclogo