Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

 
వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్
 

ప్రపంచవ్యాప్తంగా నగదు స్వీకరించేందుకు వేగవంతమైన మార్గం

విదేశాలలో నివసిస్తున్న మీ ప్రియమైన వారు మీకు దూరంగా ఉన్నా , వారు వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా స్వదేశంలోని మీ ఇంటికి నగదు పంపినప్పుడు, అది మీ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది వెస్ట్రన్ యూనియన్ యొక్క అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ మరియు ప్రపంచ స్థాయి భద్రతా యంత్రాంగం , మీ ధనాన్ని నిమిషాల్లో సురక్షితంగా మీకు చేరుస్తుంది.

 
వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి?
 

స్విఫ్ట్ / డ్రాఫ్టులు / చెక్కుల ద్వారా విదేశాలనుంచి పంపే నగదు మీకు చేరడానికి కనీసం 10 రోజుల సమయం పట్టవచ్చు. వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ తో మీరు నగదు పొందే సమయం చాలా తక్కువగా ఉంటుంది.
 
వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ గురించి ..
 


యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు చెందిన వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ నగదు బదిలీ సేవల్ని ప్రారంభించింది. ఇది ఫస్ట్ డేటా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ .ఫార్ట్యూన్ 500 కంపెనీలలో ఒకటి గా గుర్తింపు పొందిన సంస్థ. ప్రస్తుతం, వెస్ట్రన్ యూనియన్ , 190 కంటే ఎక్కువ దేశాల్లో , 1,20,000 పైగా ప్రాంతాలలో ప్రతినిధులను కలిగి ఉంది.

 
వెస్ట్రన్ యూనియన్ ద్వారా జరిగే ఒక సాధారణ నగదు లావాదేవీని వివరించండి?
 

విదేశాల్లో ఎవరైనా , భారతదేశంలో వారి కుటుంబసభ్యులకు డబ్బు పంపాలని అనుకుంటే , వారు చేయవలసిందల్లా , ఒక వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధి వద్దకు వెళ్లి , డబ్బు పంపడానికి అవసరమైన దరఖాస్తును మరియు సేవా రుసుమును వారికి అందజేయాలి . ఆ సమాచారం, వెంటనే ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్రాలతో అనుసంధానించబడిన ప్రత్యేక వెస్ట్రన్ యూనియన్ వ్యవస్థను లోకి నమోదు చేయబడుతుంది. భారత దేశంలోని స్వీకర్త / లబ్ధిదారులు , వెస్ట్రన్ యూనియన్ సేవలు అందించే ఏదైనా ఆంధ్రాబ్యాంక్ శాఖలో , నగదు స్వీకరించేందుకు దరఖాస్తు తో పాటు అనుమతింపబడే ఫోటో గుర్తింపును అందజేయాలి. ఆ సమాచారం సంతృప్తికరమైనదని ధృవీకరించుకొని ఆ శాఖ, సదరు లబ్దిదారునికి నగదు చెల్లింపు / బదిలీ చేస్తుంది.
 
ఏ ప్రయోజనం కోసం పంపే నగదును అనుమతిస్తారు?
 

రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి , వ్యక్తిగత కుటుంబం నిర్వహణ కోసం పంపే నగదు మరియు భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకులకోసం పంపే నగదు మాత్రమే ఈ సేవ ద్వారా అనుమతించబడతాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదు ,స్థిరాస్తి కొనుగోలు లేదా పెట్టుబడి నిమిత్తం పంపే నగదు, NRE / FCNR ఖాతాల కు పంపే నగదు , స్వచ్ఛంద సంస్థలకు పంపే విరాళాలు ఈ వెస్ట్రన్ యూనియన్ సేవ ద్వారా అనుమతింపబడవు.
 
ఈ పథకం కింద రిజర్వు బ్యాంకు అనుమతించిన గరిష్ట మొత్తం ఏమిటి?
 

ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులు లేదా సాధారణ ప్రజానికం కోసం పంపే మొత్తం , ఒక లావాదేవిలో 2500 అమెరికన్ డాలర్లు లేదా దానికి సమానమైన విలువ మించకూడదు. 49,999 /రూపాయల వరకు అంధ్రాబ్యాంకు శాఖల్లో నగదు చెల్లింపబడుతుంది. 50,000 /రూ . ఆ పై మొత్తాలు లబ్దిదారుని ఖాతాద్వారా లేదా పే ఆర్డర్ / డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా , బ్యాంక్ చార్జీలు లేకుండా చెల్లించబడతాయి. రిజర్వు బ్యాంకు అనుమతి ప్రకారం, విదేశీ పర్యాటకులకు 50,000 / రూపాయలకు మించిన మొత్తం కూడా నగదు గా చెల్లింపబడుతుంది. ఒక లబ్దిదారుడు / గ్రహీత ఒక సంవత్సరంలో 12 సార్లు మాత్రమే వెస్ట్రన్ యూనియన్ ద్వారా నగదు పొందేందుకు అనుమతి ఉంటుంది.
 
వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సేవలో ప్రధానాంశాలు?
 

వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సేవలకు భారతీయ రిజర్వు బ్యాంక్ అనుమతి ఉన్నది . లబ్ధిదారులు / స్వీకర్త ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. పంపినవారికి గాని లేదా స్వీకర్త / లబ్దిదారునికి గాని బ్యాంకు ఖాతా ఉండవలసిన అవసరం లేదు. ఈ సేవలు త్వరితగతిన పొందవచ్చు, న్యాయపరమైనవి, సురక్షితమైనవి మరియు నమ్మదగినవి. ప్రతి నగదు బదిలీ ప్రపంచ తరగతి భద్రతా వ్యవస్థ ద్వారా రక్షించబడింది.
 
నగదు స్వీకరించడం కోసం సమర్పించవలసిన పత్రాలు ?
 
  1. పాస్ పోర్ట్
  2. డ్రైవింగ్ లైసెన్స్
  3. రేషన్ కార్డ్
  4. వోటరు గుర్తింపు కార్డు
  5. పాన్ కార్డ్
  6. రెఫ్యూజీ కార్డ్
  7. ప్రభుత్వ కళాశాల గుర్తింపు కార్డు (ఫోటోతో )
  8. బ్యాంకు పాస్ బుక్
  9. ఆర్మీ కార్డు
  10. పోలీస్ కార్డ్ – వీటిలో

ఏదేని ఒక పత్రాన్ని లావాదేవీ సమయంలో సమర్పించవలసి ఉంటుంది.ఈ గుర్తింపు పత్రాలు లావాదేవీ సమయానికి చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.

 
ఏ ఆంధ్రాబ్యాంక్ శాఖల ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు ?
 

దాదాపు 50 శాతం ఆంధ్రా బ్యాంక్ శాఖల ద్వారా వెస్ట్రన్ యూనియన్ నగదు బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను అందించే శాఖల బయట వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సేవలను సూచించే బోర్డును గమనించి, వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు పొందవచ్చు.
 
chiclogo