 |
|
ఎబి కిసాన్ గ్రీన్ కార్డ్ (రైతుల కోసం బహుళ సౌకర్యం పథకాలు) |
|
 |
"ఆంధ్రా బ్యాంకు కిసాన్ గ్రీన్ కార్డ్" పథకం 'పట్టాభి అగ్రి కార్డ్ కింద వ్యవసాయం, & అనుబంధ వృత్తుల వారికి రుణాలు అందించడానికి ప్రవేశపెట్టిన పథకం
|
|
|
లక్ష్యాలు |
 |
ఈ పథకం సింగిల్ విండో ద్వారా అనువైన మరియు సరళమైన పద్ధతులలో రైతుల సమగ్ర రుణ అవసరాలు కోసం తగినంత మరియు సకాలంలో రుణాలు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టబడింది. రైతులకు స్వల్పకాలిక అలాగే మద్యకాలిక రుణ అవసరాలు మరియు వినియోగపు అవసరాలకు ఒక సహేతుకమైన పరికరం అందించడం ఈ పథకం లక్ష్యం.
|
|
|
లోన్ అర్హత |
 |
గత మూడు సంవత్సరాలుగా పట్టాభి అగ్రి కార్డ్ సౌకర్యాన్ని మన బ్యాంక్ తో సంతృప్తికరంగా ఉపయోగించుకుంటున్న రైతులు. కేవలం యజమాని రైతులు రుణాలకి అర్హులు.
|
|
|
Nature of Financial assistance |
 |
ఈ పథకం కింద అందించే క్రెడిట్ వ్యవసాయానికి/అనుబంధ కార్యకలాపాలకి టర్మ్ లోన్లు & వినియోగం క్రెడిట్ మరియు స్వల్పకాలిక రుణాలకి రివాల్వింగ్ క్రెడిట్ లాంటి స్వభావం కలిగి ఉంటుంది.
|
|
|
రుణ పరిమితి |
 |
-
రుణ పరిమితి వార్షిక వ్యవసాయ ఆదాయానికి 5 సార్లు లేదా భూమి(స్వంత) ఆస్తి విలువలో 50% గరిస్ట మొత్తం రూ.5.00 లక్షల లోబడి ఉంటుంది.
- కనీస కార్డు పరిమితి రూ.25,000/- ఉంది.
-
పంట ఉత్పత్తిపై అలాగే వ్యవసాయం, దాని అనుబంధ కార్యక్రమాలకు మూలధనం ఆధారంగా రుణ మొత్తం నిర్ణయించబడుతుంది. మంజూరు. చేసిన మొత్తం ఋణ పరిమితిలో, వ్యావసాయిక పనిముట్లు కొనుగోలు, భూమి అభివృద్ధి, బండి & ఎడ్ల కొనుగోలు పాల ఉత్పత్తి చేసే జంతువులు, గొర్రెలు etc కొనుగోలు, వ్యవసాయ యంత్రాలు మరమ్మత్తు సహా ఇతర సాధారణ అవసరాలైన అనారోగ్యం,పిల్లల విద్య మరియు కుటుంబ వేడుకలు వీటిలో తన సొంత ప్రయోజనం ఏదైనా ఎంచుకోవడానికి రైతకు స్వేచ్ఛ ఉంది.
- మొత్తం రుణ పరిమితి ప్రాజెక్టు నికర ఆదాయాలు మరియు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యంతో సంబంధం కలిగి ఉంటుంది.
|
|
|
కార్డు చెల్లుబాటు కాలం |
 |
కార్డు పరిమితి ఒక సంవత్సరం కాలం చెల్లుతుంది మరియు సంవత్సరం తర్వాత సంవత్సరం పునరుద్దరించుకోవచ్చు. తరువాతి సంవత్సరాల్లో పునరుద్ధరణ లేఖ మినహా ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అయితే మూడవ సంవత్సరం చివరిలో పాత్రలు తాజాగా తీసుకోవాల్సి వుంటుంది. వాయిదాల / అవుట్ స్టాండింగ్ చెల్లింపులో కార్డ్ హోల్డర్ డిఫాల్ట్ ఐతే తర్వాత ఉపసంహరణలకి అనర్హుడవుతాడు.
|
|
|
ఆపరేషనల్ విధానం
|
 |
-
ఉపసంహరణకు(drawl) కల కారణం మరియు సుమారుగా అయ్యే ఖర్చులోంచి కనిష్ట మార్జిన్ 15% తీసేసి రైతు శాఖ మేనేజర్ కి తెలియజేయాలి వినియోగం క్రెడిట్ కోసం drawls మంజూరు చేసిన పరిమితిలో 20% మించరాదు. అవసరాన్ని బట్టి drawls వాయిదాలలో చేసుకోవచ్చు. ప్రతి ప్రయోజనం కోసం ఒక ప్రత్యేక ఖాతాను తెరిచి మరియు దానికి తిరిగి చెల్లించే విధానాన్ని రైతును సంప్రదించి ప్రత్యేకంగా రూపొందించాలి.
-
రైతు ధరకాస్తు ఆమోదించాక అతనికి ఫోటో మరియు ఇతర సంబంధిత వివరాలతో కూడిన ఒక గుర్తింపు కార్డు-కమ్-పాస్ పుస్తకం జారీ చేయబడుతుంది. రైతు వివిధ వ్యవధుల్లో తన అవసరాన్ని బట్టి వివిధ ఖాతాలని తెరిచి గరిస్టంగా ఐదు ఖాతాలు అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చును. ఇలా తెరిచిన వివిధ ఖాతాలకు ప్రత్యెకంగా డాక్యుమెంటేషన్ మరియు ఇతర లాంఛనాలు అవసరం లేదు.
|
|
|
వడ్డీ రేటు |
 |
వ్యవసాయ రుణాలకు వర్తించే విధంగా. ప్రతి సౌకర్యం ఒక ప్రత్యేక ఖాతాలా పరిగణించబడి మరియు తదనుగుణంగా వడ్డీ వుంటుంది. |
|
|
నిర్వహించాల్సిన రిజిస్టర్లు |
 |
జారీ చేసిన గ్రీన్ కార్డులు మరియు పథకం కింద మంజూరు చేసిన రుణాలు వివరాలు పొందుపర్చడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక రిజిస్టర్ నిర్వహించబడుతుంది.
|
|
|
రుణాల వర్గీకరణ |
 |
రుణాలు ఇచ్చిన ప్రయోజనం.(పర్పస్) బట్టి రుణ వర్గీకరణ ఉంటుంది. |
|
|
బీమా |
 |
- వ్యక్తిగత ప్రమాద బీమా పథకం క్రింద (PAIS) రూ.50,000/- వరకు కవరేజ్
- ICD పథకం కింద అగ్రి కార్డ్ పథకంలో రూ.1,00,000/- ఐచ్ఛిక ప్రమాద బీమా ఉంటుంది.
|
|
|
ప్రుడెన్షియల్ నిబంధనలను |
 |
- ప్రుడెన్షియల్ నిబంధనలు ఆర్బిఐ నియమాల ప్రకారం వర్తిస్తాయి
- ఏ ఒక్క రుణ సౌకర్యం బలహీనంగా ఉన్నా మిగతా రుణ సౌకర్యాలలో ఉపసంహరణ స్వయంచాలకంగా నిలిచిపోతుంది.
|
|
|
తిరిగి చెల్లించే కాలం |
 |
స్వల్పకాలిక క్రెడిట్ / పంట రుణాలు అలాగే వ్యవసాయానికి మూల ధనం మరియు అనుబంధ కార్యకలాపాలు వంటి వాటికి రివాల్వింగ్ క్రెడిట్ సమకూర్చటం కొనసాగుతుంది మరియు ఇది ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీ కన్నా ముందే తిరిగి చెల్లించబడాలి. టర్మ్ లోన్ భాగం చర్య / పెట్టుబడి రకాన్ని బట్టి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల మేరకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
|
|
|