|
|
ఎబి కిసాన్ రక్షక్ (రైతు రుణ మార్పిడి పథకం) |
|
లక్ష్యాలు |
 |
సంస్థాగతం కాని అంటే ప్రైవేట్ రుణదాతలు దగ్గర డబ్బు తీసుకుని అప్పుల్లో ఉన్న రైతులకు వారి అప్పులు తీర్చడానికి రుణాలు అందించడం కోసం. |
|
|
కవరేజ్ |
 |
సహాయక చర్యలు వీటిని కవర్ చెయ్యడం కోసం
-
ప్రస్తుతం ఖాతాదారులై ఉంది గతంలో తాము తీసుకున్న రుణాలను తమ నియంత్రణలో లేని అంశాలతో తప్ప వడ్డితో సహ నిర్దిష్ట వాయిదాలలో చెల్లించిన రైతుల కోసం.
- బ్యాంకు శాఖ సేవా ప్రాంతంలో ఉండే రుణగ్రహీతలు కాని రైతులు కోసం
-
ఒక రుణగ్రహీత కాని రైతు బ్యాంకును సంప్రదించిన యెడల,అతడు/ఆమె కి పట్టాభి అగ్రి కార్డ్ కింద పంట రుణ పరిమితికి అర్హత అంచనా వెయ్యడం మరియు అర్హత మేరకు సంస్థాగతం కాని వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చడానికి ప్రత్యేక మొత్తం.
|
|
|
ప్రస్తుత రుణగ్రహీతలు |
 |
* సాధారణ పంట రుణ పరిమితితో పాటు, పంట రుణం(పట్టాభి అగ్రి కార్డ్) మంజూరు పరిమితిలో 50% గరిష్టంగా రూ.50,000/- (లేదా) అప్పు మేరకు ఏది తక్కువైతే అది సంస్థాగత కాని రుణదాతలు నుంచి తీసుకున్న అప్పులు తీర్చడానికి అదనపు లోనుగా పరిగణలోకి తీసుకోబడుతుంది.
|
|
|
రుణగ్రహీత కాని రైతులు (న్యూ loanees) |
 |
* రుణగ్రహీత కాని రైతులు కూడా అర్హులు. పంట సరళి మరియు ఆర్థిక ప్రమాణాల ఆధారంగా పట్టాభి అగ్రి కార్డ్ పరిమితి మొదట నిర్ణయింపబడుతుంది
-
సాధారణ పంట రుణ పరిమితితో పాటు, పంట రుణం(పట్టాభి అగ్రి కార్డ్) మంజూరు పరిమితిలో 50% గరిష్టంగా రూ.25,000/- (లేదా) అప్పు మేరకు ఏది తక్కువైతే అది సంస్థాగత కాని రుణదాతలు నుంచి తీసుకున్న అప్పులు తీర్చడానికి అదనపు లోనుగా పరిగణలోకి తీసుకోబడుతుంది.
|
|
|
నిబంధనలు |
 |
* రైతు సంస్థాగతం కాని రుణదాతల దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం అవసరమైన మొత్తాన్ని నేరుగా చెక్ / డిమాండ్ డ్రాఫ్ట్ / పే ఆర్డర్ ద్వారా, ఆర్థిక నోటు(Financial Instrument) తీసుకుని విడుదల చేయబడును. తీసుకున్న పత్రం(instrument) లోను పత్రాలతో కలిపి భద్రపరచాలి.
|
|
|
|
|
తిరిగి చెల్లించే విధానం: |
 |
1 సంవత్సరం రుణ చెల్లింపు మొదలయ్యే ముందు సెలవు కాలం(Gestation period) తరువాత ఏడు సంవత్సరాలలో తిరిగి చెల్లించబడతాయి. టర్మ్ లోన్ వార్షిక విడత పట్టాభి అగ్రి కార్డ్ లోనుతో పాటు ప్రతి సంవత్సరం జూన్ 30 లోపు లేదా ఉత్పత్తి మార్కెటింగ్ ఏది ముందు అయితే అది రికవరీ చెయ్యాలి.
|
|
|
సెక్యూరిటీ |
 |
- రూ. 1 లక్ష లోపు మొత్తానికి పంటలు Hypothecation & సరిపడినంత co-obligation
- రూ.1 లక్ష పైబడిన మొత్తాలకి బ్యాంకు ఋణం విలువకు సమానమైన కొల్లేటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి.
|
|
|
మరిన్ని వివరాల కోసం, సమీప బ్రాంచిని సంప్రదించండి |
|