ఆంధ్రా బ్యాంక్ ఖతాదారుల అవసరాల ద్రుష్ట్యా నాన్ ఫండ్ లిమిట్స్ ని మంజూరు చేయుచున్నది.
అన్ని రకాల వినియోగదారులు అనగా కార్పొరేట్లు, సంస్థలు, ఏకైక యాజమాన్య సంస్థలు, వ్యక్తులు అర్హులు.
లెటర్ ఆఫ్ క్రెడిట్, ఫారిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇన్లాండ్ బ్యాంక్ గ్యారెంటీ, ఫారిన్ బ్యాంక్ గ్యారెంటీ మరియు డెఫర్డ్ పేమెంట్ గ్యారెంటీలు నాన్ ఫండ్ లిమిట్స్ గా పరిగణించబడతాయి.
ఐ ఎల్ సి/ ఎఫ్ ఎల్ సి లను యంత్రాలు, ముడి సరుకులు మరియు సేవలు పొందే వినియోగదారుల తరపున జారీ చేయడం జరుగుతుంది.
డెఫర్మెంట్ ఆఫ్ ట్యాక్స్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లకు బ్యాంక్ గ్యారెంటీలు జారీ చేయబడతాయి.
వాయిదాపడిన చెల్లింపులకు డెఫర్డ్ పేమెంట్ గ్యారెంటీలు జారీ చేయబడతాయి.
మార్జిన్ మరియు చార్జీలు కస్టమర్ యొక్క క్రెడిట్ రేటింగ్ మరియు రుణ యోగ్యత మీద ఆధారపడి ఉంటాయి.
|