ప్రతి వ్యవస్థకు (అనగా కంపెనీ / సంస్థ / వ్యక్తి ) రోజు వారి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి, స్టాక్ మరియు ముడి సరుకుల కొనుగోలు నుండి చివరి దశ వస్తువులు తయారు చేయువరకు డబ్బు అవసరం అవుతుంది. ఆంధ్రా బ్యాంక్ ఫండ్ లిమిట్స్ ద్వారా ముడి పదార్థాలను కొనుగోలు చేయుటకు నిధులను అందిస్తున్నది. ఆంధ్రా బ్యాంక్ వినియోగదారులకు ద్రవ్యలభ్యత సమకూర్చేన్దుకు రిసీవబుల్స్ ఫైనాన్స్ కూడా అందిస్తున్నది.
హొటల్స్,రెస్టారెంట్స్,హాస్పిటల్స్,నర్సింగ్ హోమ్స్ మొదలైన వాటికి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ మంజూరు సమయములో అర్బన్ / సెమీ అర్బన్ ప్రాంతాలలోని స్థిరాస్తులను తనఖాగా పెట్టుకుని సెక్యూర్డ్ ఓవద్రాఫ్ట్ ఇవ్వబడుతుంది. ఇవి కాకుండా, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, విద్యా సంస్థలు మొదలైన వాటికి కూడా సెక్యూర్డ్ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కలదు.
|