యూఎస్ఏ లోని బ్యాంకులలో యూఎస్ డాలర్స్ లో తీసిన చెక్కులను కూడా జమ చేయగలిగే సౌలభ్యం శాఖలకు కల్పించడం కోసం మేము 'బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్' తో ఒప్పందం కుదుర్చుకున్నాము.
క్రింది శాఖలు, యూఎస్ఏ లోని బ్యాంకుల పై తీసిన యూఎస్ డాలర్ చెక్కుల సేకరణ కోసం పూలింగ్ కేంద్రాలుగా గుర్తించబడ్డాయి.
- ఓవర్సీస్ శాఖ, హైదరాబాద్ (ఏపీ & తెలంగాణ రాష్ట్రాలలోని శాఖల కోసం)
- మాతుంగ శాఖ, ముంబై (భారతదేశం లోని మిగిలిన శాఖల కోసం)
పూలింగ్ సెంటర్ (సేకరణ కేంద్రం) చెక్కులను బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ (బిఓఏ -ఎంఎల్) వారి స్కానర్ తో స్కాన్ చేసి, చిత్రాలను, యూఎస్ బ్యాంకులలో తీసిన యూఎస్ డాలర్ చెక్కులయొక్క ఎంఐసిఆర్ సమాచారాన్ని, నిక్షిప్త ఇంటర్నెట్ సౌలభ్యం ద్వారా బిఓఏ-ఎంఐఎల్ కు పంపిస్తుంది.
నోస్ట్రో ఖాతా లో జమ (క్రెడిట్) అయినప్పటినుంచి ఐఐబి యొక్క 14 ఫారెక్స్ పని దినాల (cooling period) తరువాత క్రెడిట్ ను ఐఐబి, పూలింగ్ సెంటర్ (సేకరణ కేంద్రం) కు పంపిస్తుంది.
|
|