 |
|
వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ |
|
వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ |
 |
|
|
మనీ ప్రపంచవ్యాప్తం వేగవంతమైన మార్గం |
 |
విదేశాలలో నివసిస్తున్న, మీ ప్రియమైన వారు అలా దూరంగా ఉన్నారు. కానీ, వారు వెస్ట్రన్ యూనియన్ ద్వారా ధనాన్ని ఇంటికి పంపినప్పుడు వారు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. వెస్ట్రన్ యూనియన్ యొక్క స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్ వ్యవస్థలు మరియు సురక్షిత ప్రపంచ నెట్వర్క్ ద్వారా, ధనం నిమిషాల్లో సురక్షితంగా మీకు చేరుతుంది.
|
|
|
*****వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ఏమిటి? |
 |
సాదరణంగా విదేశాల నుంచి స్విఫ్ట్/ డ్రాఫ్టులు/ చెక్కుల ద్వారా లావాదేవీ వచ్చినపుడు కస్టమర్ గ్రహించడానికి 10 రోజులు పడుతుంది. వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్, తీసుకునే సమయం చాలా తక్కువగా ఉంటుంది.
|
|
|
*****వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రవేశం : |
 |
వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్,యుయస్ఏ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలను ప్రవేశపెట్టింది. ఇది ఫస్ట్ డేటా కార్పోరేషన్, ఫార్చ్యూన్ 500 సంస్థ యొక్క అనుబంధ సంస్థ. ప్రస్తుతం, వెస్ట్రన్ యూనియన్ 190 దేశాల్లో 1,20,000 కంటే ఎక్కువ ఏజెంట్ ప్రాంతాలను కలిగి ఉంది.
|
|
|
*****వెస్ట్రన్ యూనియన్ ద్వారా జరిపే సాధారణ ద్రవ్య లావాదేవీలను వివరించండి? |
 |
ఒకరు భారతదేశం లో వారి కుటుంబానికి డబ్బు పంపాలని అనుకుంటే, వారు చేయవలసిందల్లా ఒక వెస్ట్రన్ యూనియన్ ఏజెంట్ దగ్గరికి వెల్లడమే. అక్కడ వారు ఒక "టు సెండ్ మనీ " ఫారంను పూర్తిచేసి మరియు ఆ మొత్తంను ఏజెంట్ కి అవసరమైన సేవా రుసుముతో పాటు అప్పగించండి. సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక యాజమాన్య సాఫ్ట్ వేర్ ద్వారా వివిధ కేంద్రాలలో అనుసంధానించబడిన ప్రత్యేక వెస్ట్రన్ యూనియన్ వ్యవస్థలోకి ఫీడ్ చేయడం జరుగుతుంది. స్వీకర్త/ లబ్ధిదారులు ఇప్పుడు మా ప్రత్యేక గుర్తింపు పొందిన, వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సేవలను అందిస్తున్న ఆంధ్రా బ్యాంక్ శాఖలకి వెల్లి పూర్తిగా నింపిన "మనీ రిసీవ్" ఫారం మరియు సరైన ఫోటో గుర్తింపు చూపించాలి. ఈ సమాచారాన్ని తనిఖీచేసి మరియు సంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించిన తరువాత, బ్రాంచ్ ఆ మొత్తాన్ని లబ్దిదారునికి చెల్లిస్తుంది.
|
|
|
*****ఇందులో ఏ రకమైన లావాదేవీలు అనుమతిస్తున్నారు / వేటికి అనుమతి లేదు? |
 |
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) మార్గదర్శకాల ప్రకారం, కుటుంబ నిర్వహణ పట్ల వ్యక్తిగత లావాదేవీలు మరియు భారతదేశం సందర్శించడం కోసం వచ్చిన విదేశీ పర్యాటకుల లావాదేవీలు మాత్రమే ఈ సేవకింద అనుమతించబడతాయి. అన్ని వర్తక సంబంధించిన లావాదేవీలు- ఆస్తి, పెట్టుబడుల కొనుగోలుకు పంపిన డబ్బు, NRE/ FCNR ఖాతాలకి జమ చేయు లావాదేవీలు లేదా విరాళములు/ చారిటబుల్ సంస్థల విరాళాలకి ఈ సర్వీస్ కింద అనుమతి లేదు.
|
|
|
*****ఈ పథకం కింద ఆర్బిఐ అనుమతించిన గరిష్ట మొత్తం ఎంత? |
 |
మా వినియోగదారులు మరియు సాధారణ ప్రజలకి,ఈ పథకం కింద ఏ ఒక్క చెల్లింపుకైనా 2500 డాలర్లు మించకూడదు. శాఖలో లబ్దిదారునికి రూ. 49,999/- వరకు ధనరూపంలో ఇవ్వవచ్చు, రూ. 50,000/- అంతకు మించి మొత్తాలను పే ఆర్డర్ / డిమాండ్ డ్రాఫ్ట్లుల(మా బ్యాంక్ ఛార్జీలు లేకుండా) ద్వారా లేక లబ్దిదారుని ఖాతాకు డైరెక్ట్ గా చెల్లించవచ్చు. ఆర్బిఐ అనుమతి ప్రకారం విదేశీ పర్యాటకులకు 50,000/- అధిగమించి కూడా నగదు చెల్లింపు చేయవచ్చు. కేవలం 12 లావాదేవీలకి మాత్రమే ఒక గ్రహీతకు ఒక సంవత్సరంలో అనుమతి ఉంటుంది.
|
|
|
*****ఈ సేవలోని ప్రధానాంశాలు?
|
 |
ఈ సేవకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) అనుమతి వుంది. లబ్ధిదారులు/ స్వీకర్త ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. పంపినవారు లేదా స్వీకర్త, ఎవరికీ బ్యాంకు ఖాతా కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సేవ ఫాస్ట్, సేఫ్, చట్టబద్దం మరియు నమ్మకమైనది. ప్రతి బదిలీ ఒక విశిష్టమైన భద్రతా వ్యవస్థ యొక్క రక్షణలో ఉంది.
|
|
|
*****డబ్బు స్వీకరించడం కోసం అవసరమైన గుర్తింపు రుజువులు? |
 |
- 1. పాస్ పోర్ట్ 2. డ్రైవింగ్ లైసెన్సు 3. రేషన్ కార్డ్ 4. వోటర్ ఐడి 5. పాన్ కార్డు 6. రెఫ్యూజీ కార్డ్
***** 7. ప్రభుత్వ కళాశాల జారీచేసిన విద్యార్థి ఐడి 8. బ్యాంకు పాస్ బుక్ (ఫోటోతో) 9. ఆర్మీ కార్డ్
***** 10. పోలీస్ కార్డ్
ఈ పైన తెల్పిన రుజువులు లావాదేవీల సమయంలో చెల్లుబాటు అవుతాయి.
|
|
|
*****ప్రస్తుతం చెల్లింపులు చేస్తున్న ఆంధ్రాబ్యాంక్ శాఖలు? |
 |
దాదాపు 50% ఆంధ్రా బ్యాంక్ శాఖలు వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కింద డబ్బు బదిలీ చేస్తున్నాయి. మీరు డబ్బు అందుకోవడానికి శాఖల ముందు వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సైన్ బోర్డు కొరకు చూడండి.
|
|
|