 |
|
ఆంధ్రా బ్యాంక్ గిఫ్ట్ కార్డుల గురించి తెలుసుకోండి |
|
ప్రీపైడ్ కార్డ్ అనగా ముందే ఒక పరిమితితో మనీ విలువ లోడ్ చేయబడిన కార్డు. ఇది భారతదేశం లోనే మొదటి ప్రీపెయిడ్ కార్డు. POS లావాదేవీలకు పిన్,స్వయంకలిత కార్డ్ లాకింగ్, కస్టమర్ సెల్ఫ్ కేర్ చర్యలకు కస్టమర్ ఎంపిక చేయగల 4 అంకెల పర్సనల్ యాక్సెస్ కోడ్ మరియు ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డుల పై అత్యవసర వినియోగం కోసం స్టాండ్-ఇన్ కార్డు సౌకర్యం.
బ్యాంక్ USD కరెన్సీ లో గిఫ్ట్, ప్రయాణం కార్డులు మరియు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తో సహ బ్రాండెడ్ ప్రిపెయిడ్ కార్డ్ ప్రారంభించింది. |
|
గిఫ్ట్ కార్డు: |
|
ఫ్లెక్సీ డినామినేటెడ్ గిఫ్ట్ కార్డులు రూ. 250/- నుండి రూ.1,00,000 వరకు జారీ చేస్తారు. కార్డ్ ముఖ్యంగా, యువ తరాలని ఆకర్షించేందుకు అన్ని టెక్ అవగాహన సౌకర్యాలతో ఒక ఈస్తటిక్ గిఫ్ట్ ప్యాక్ లో అందించబడుతుంది. కార్డులు అన్ని మాస్టర్ కార్డ్ ఇంటర్నేషనల్ అనుబంధిత మర్చంట్స్ వద్ద అనుమతించబడతాయి. గిఫ్ట్ కార్డులు ఎంపిక చేయబడిన మా శాఖలలో జారీ చేస్తారు |
|
|
గిఫ్ట్ కార్డుల యొక్క ఫీచర్స్ |
 |
- POS వాడుకకై పిన్ నెంబర్ ఎనేబుల్ చేయబడెను , ఆయా POS టెర్మినల్ పిన్ కోసం ప్రాంప్ట్ చేయటాన్ని బట్టి.
- కార్డు దుర్వినియోగం నిరోధించడానికి స్వయంకలిత (సెల్ఫ్ ఆపెరబల్) తాత్కాలిక కార్డ్ లాకింగ్ సౌకర్యం .
- ప్రీపెయిడ్ కార్డు-కస్టమర్ సెల్ఫ్ కేర్ పోర్టల్ ని ఉపయోగించుకోవటానికి అవసరమైన 4 అంకెల పర్సనల్ యాక్సెస్ కోడ్ (PAC) ని కార్డు గ్రహీత ఎంచుకొనే వీలు కల్పించబడినది.
- కార్డ్ పోయినా/దొంగిలించ బడిన/పాడైపోయినా, బ్రాంచిలలో సింపుల్ యాక్టివేషన్ సౌకర్యముతో రీప్లేస్మెంట్ కార్డు ఇవ్వబడును.
- గిఫ్ట్ కార్డులు మొదట POS లావాదేవిలకే ( ట్రాన్సాక్షన్లకే ) అనుమతిస్తున్నారు త్వరలో ఇంటర్నెట్ మరియు ఐవిఆర్ (మొబైల్ / ఫోన్) చెల్లింపు లావాదేవీలకై పొడిగించబడును.
- ఖాతా ప్రకటన (ఎకౌంటు స్టేట్మెంట్) యొక్క ప్రింట్ కోసం చార్జీలు వర్తిస్తాయి.
- SMS హెచ్చరికలు ఉచితంగా అన్ని లావాదేవీలకు పంపించబడును.
|
|
|
ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు జారీ చేయుటకు ప్రమాణములు/అర్హత ( నార్మ్స్) : |
 |
- దరఖాస్తుదారుడు 18 సంవత్సరాలు లేదా ఆపైన వయస్సు కలిగిన భారతీయ పౌరుడై ఉండాలి.
- బ్యాంకు యొక్క వినియోగదారులు కాని వారు కెవైసి పత్రాలు ( KYC డాక్యుమెంట్లు) సమర్పించవలసి ఉంటుంది.
- భారతదేశం లోని ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క జాబితాలో రిజిస్టర్ అయిఉన్న కార్పొరేట్ వాటి ఉద్యోగులు, వినియోగదారుల పంపిణీ కోసం గిఫ్ట్ కార్డుల కొనేందుకు అర్హులు కాని అటువంటి వ్యక్తుల కెవైసి నిబంధనలను సంతృప్తికరంగా ఉన్న తర్వాత మాత్రమే.
|
|
|
చార్జీల షెడ్యూల్: |
 |
|
|
క్రమ సంఖ్య |
వివరాలు |
బహుమతి పత్రాలు |
1 |
కొత్త కార్డ్ జారీ * వినియోగదారుల కాని వారికి అదనపు 25% ఛార్జీలు విధించిబడును |
రూ .25 / - రూ .1,000 విలువ వరకు
రూ .50 / - విలువ రూ 1,001 పైన కోసం |
2 |
కార్డుల హాట్ లిస్టింగ్ |
రూ .100 / - |
3 |
పిన్ లేదా పాస్వర్డ్ కొత్త /రీప్లేస్మెంట్ జారీ |
రూ .50 / - |
4 |
హాట్ లిస్టు చేయబడిన / పాడైపోయిన /విరిగిపోయిన కార్డ్ యొక్క రీప్లేస్మెంటుకు |
రూ .50 / - |
5 |
అకౌంట్ స్టేట్మెంట్ & ఇవ్వబడ్డ చిరునామాకు పంపడం |
రూ .25 / - |
6 |
ఆంధ్రా బ్యాంక్ ATM లో బ్యాలెన్స్ విచారణ
ఇతర బ్యాంక్ ఎటిఎంలో బాలన్సు విచారణ |
ఉచితం
వర్తించు చార్జీల ప్రకారం |
7 |
కార్డు గడువు ముగిసిన యెడల , కెవైసి పత్రాలు సమర్పిస్తే కొత్త గిఫ్ట్ కార్డు జారీ ద్వారా ఔట్‌స్టాండింగ్ బాలన్సు ఇవ్వబడుతుంది |
రూ .25/- డిడక్ట్ చేయబడును, కార్డు లో రూ.25 /- కంటే ఎక్కువ బాలన్సు ఉంటే |
8 |
గిఫ్ట్ కార్డు గడువు కాలం పూర్తయే సమయములో ఔట్‌స్టాండింగ్ బాలన్సు రూ.25/- కంటే తక్కువ ఉంటే, |
రిఫండ్ ఇవ్వబడదు మరియు ఆ అమౌంట్ ఛార్జీల కై సర్దబడును. |
9 |
కార్డు తాత్కాలిక లాకింగ్ యొక్క ఛార్జీలు |
రూ 10 /- ప్రతి రిక్వెస్టుకు |
|
|
కార్డ్ యొక్క నిబంధనలు మరియు షరతులు |
 |
|
- నాన్-పర్సనలైజడ్ మరియు నాన్-రీలోడబల్ కార్డులు జారీ చేస్తారు.
- భారతదేశం లో చెల్లింపుకు మాత్రమే కార్డ్ చెల్లుతుంది మరియు నగదును తీసుకోవటం ( కాష్ విత్‌డ్రాయల్ ) కోసం చెల్లుబాటు కాదు.
- కార్డ్ పైన ముద్రించిన నెల మరియు సంవత్సరంతో సంబంధం లేకుండా,కొనుగోలు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు కార్డు వాలిడిటి కలిగివుంటుంది మరియు అదే నెల చివరి రోజు వరకు చెల్లుబాటులో ఉంటుంది.
- కార్డ్ ఖాతాలో ఉన్న బాలన్సు పై వడ్డీ చెల్లించ బడదు.
- గిఫ్ట్ కార్డ్ ఖాతా పై ఓవర్‌డ్రాఫ్ట్ ఏ పరిస్థితిలోనూ అనుమతించ బడదు.
- గిఫ్ట్ కార్డ్ కరెన్సీ సమయంలో కాన్సిల్లెషన్ అనుమతి లేదు.
- ఆఫ్లయిన్ MOTO (మనీ ఆర్డర్ లేదా టెలిఫోనిక్ ఆర్డర్), మాన్యువల్ కీ ఎంట్రి లావాదేవీలు, ఇంటర్నెట్ జూదం వాడకం, వాయిదాల చెల్లింపులు, ప్రత్యక్ష డెబిట్ లావాదేవీలు, ప్రీ-ఆథరైజేషన్ బుకింగ్స్ మొదలగు వాటి కోసం గిఫ్ట్ కార్డ్స్ ఎనేబుల్ చేయలేదు.
- ఫీజు / విధించిన ఛార్జీలు ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి వాపసు ఇవ్వబడవు
- మరణం, దివాలా లేదా డబ్బు లేని స్థితి మొదలగు సమాచారం బ్యాంక్ ఏ మూలాల నుండైనా అందినచో కార్డు వాడుక ఏ నోటీసు లేకుండా టెర్మినేట్ చేయవచ్చు.
కస్టమర్ సర్వీస్: వినియోగదారుని స్నేహపూర్వక సేవలు బ్యాలెన్స్ ఎంక్వైరీ, లావాదేవీ వీక్షణ, కార్డ్ ఖాతా స్టేట్మెంట్, స్వీయ లాకింగ్ / కార్డు అన్లాకింగ్, పిన్ మార్పు / అన్‌లాక్, కార్డు దొంగిలించ బడిన/పోయిన/కనబడుట లేక పోయినట్లయితే రిపోర్ట్ చేయటం, కార్డు రిప్లేస్మెంటుకై రిక్వెస్ట్, వివాద సమర్పణ మొదలైనవి ఈ క్రింది ఛానల్లలో అందుబాటులో ఉంటాయి.
- 24x7 టోల్ ఫ్రీ ఐవిఆర్ హెల్ప్‌లైన్: 1800 425 4059
- కస్టమర్ కేర్ పోర్టల్ :
- ఫ్యాక్స్: 040 2475 5052
- కస్టమర్ కేర్ ఆఫీసర్ - కార్యాలయం పని వేళలలో 040 2468 3206 లేదా 040 2475 1157
మరిన్ని వివరాలకు, మీ సమీప ఏదైనా ఆంధ్రాబ్యాంక్ బ్రాంచీని సంప్రదించండి లేదా ఏదైన విచారణ కోసం prepaidcards@andhrabank.co.in లేదా ccdhelpdesk@andhrabank.co.in లకి ఇ-మెయిల్ పంపవచ్చు.
|
|
|